‘నచ్చడం.. నచ్చకపోవడం అనేది దృక్కోణంలో మాత్రమే కాదు, మానసిక పరిస్థితి మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఒకరికి మనం నచ్చలేదు అంటే.. వారి మానసిక పరిస్థితిని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఏమో.. మరో సందర్భంలో వారికే మనం నచ్చొచ్చు.’ అంటూ నర్మగర్భంగా మాట్లాడింది సైఫ్ అలీఖాన్ తనయ, బాలీవుడ్ నటి సారా అలీఖాన్. సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్స్ గురించి ఆమె మాట్లాడింది.
ఇంకా చెబుతూ ‘నా యాక్టింగ్ నచ్చినివాళ్లంతా సోషల్ మీడియాలో నాపై విమర్శలు గుప్పిస్తుంటారు. తొలినాళ్లలో కాస్త బాధపడేదాన్ని. ఇప్పుడు మానసికంగా దృఢంగా తయారయ్యా. అందుకే వాటిని ఫిల్టర్ చేయడం మొదలుపెట్టా. ‘అదెలా?’ అనేగా మీ సందేహం. దానికి సహాయపడేది ధ్యానం. అది మనమేంటో మనకు చెబుతుంది. నిజమేంటో మనసుకు చెబుతుంది. నటిగా సుదూరప్రయాణం చేయాలనుకుంటున్నా. ఈ క్రమంలో నేనంటే నచ్చనివాళ్లు కూడా నన్ను మెచ్చేలా చేసుకుంటా. అదే నా లక్ష్యం.’ అంటూ చెప్పుకొచ్చింది సారా అలీఖాన్.