Sara Ali Khan | కెరీర్లో సాధించబోయే గమ్యాలకు హద్దులేవీ పెట్టుకోలేదని, నటిగా మరెవరూ చేరుకోలేనంత స్థాయికి ఎదగాలని ఉందని చెబుతున్నది బాలీవుడ్ యువతార సారా అలీఖాన్. సైఫ్ అలీఖాన్ కూతురిగా ‘కేథరీనాథ్’ చిత్రంతో తెరంగేట్రం చేసిందీ నాయిక. ‘సింబా’, ‘లవ్ ఆజ్ కల్’, ‘అత్రంగీ రే’ వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించి ఆమెకు స్టార్డమ్ తీసుకొచ్చాయి. సారా చేతిలో ప్రస్తుతం దాదాపు అరడజను చిత్రాలు ఉండటం బాలీవుడ్లో ఆమె క్రేజ్‌కు నిదర్శనం. ఈ ఉత్సాహంలో నటిగా మరింత ఎదుగుతాననే ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేసింది సారా అలీఖాన్.
సారా అలీఖాన్ మాట్లాడుతూ…‘నటిగా ఎంత ఎత్తుకు ఎదగాలనే విషయంలో హద్దులేం పెట్టుకోలేదు. మరెవరూ చేరుకోలేనంత స్థాయికి చేరాలని ఉంది. ప్రతి రోజూ అభినయంలో పరిణితి సాధించడమే ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం. అనుకున్నది సాధిస్తాననే ఆత్మవిశ్వాసం ఉంది’ అని చెప్పింది. ప్రస్తుతం సారా అలీఖాన్ ‘ఆయే వతన్ మేరే వతన్’, ‘గ్యాస్ లైట్’, ‘మర్డర్ ముబారక్’తో పాటు దర్శకులు లక్ష్మణ్ ఉటేకర్, జగన్ శక్తి రూపొందిస్తున్న కొత్త చిత్రాల్లో నటిస్తున్నది.
“Sara Ali Khan | చిట్టి పొట్టి దుస్తుల్లో సెగలు పుట్టిస్తున్న సారా అలీ ఖాన్..”