Sara Ali Khan | బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీఖాన్ గురించి పరిచయం అక్కర్లేదు. సైఫ్ అలీఖాన్ వారసురాలిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సారా మొదటి సినిమాతోనే అందరినీ ఆకట్టుకుంది. అన్నట్టు, సారా మంచి భోజనప్రియురాలు. ఈ విషయం సారాను సామాజిక మాధ్యమాల్లో ఫాలో అయ్యే వారికి ఇట్టే తెలిసిపోతుంది.
తాను ఫుడ్డీ అని ఒప్పుకోడానికి సారా ఎప్పుడూ వెనుకాడదు. తనకు నచ్చిన రుచుల విశేషాలు అభిమానులతో పంచుకుంటూనే ఉంటుంది. సినిమాల్లోకి రాకముందు ప్లస్ సైజ్‌లో ఉండేది సారా. ఇప్పుడు మాత్రం సన్నజాజి తీగే! తన సైజ్‌లో తేడా వచ్చినా, టేస్ట్‌లో మాత్రం తేడా లేదంటున్నది. ఎక్కడికెళితే అక్కడి రుచులన్నీ లాగించేస్తుంది. మాల్దీవుల్లో రోడ్‌సైడ్ మీల్స్ రుచి చూస్తూ, జైపూర్‌లో స్పెషల్ థాలీ ఆరగిస్తూ.. వాటి రుచులను అక్షరాల్లో పంచుకుంటుంది సారా.
“Sara Ali Khan | బ్లాక్ కలర్ డ్రెస్‌లో సారా అలీ ఖాన్ అందాల ఆరబోత..”