బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్, తన మాజీ ప్రియురాలు సారా అలీ ఖాన్ మళ్లీ కలిసారు. నాలుగేళ్ల క్రితం ఈ మాజీ ప్రేమ జంట విడిపోగా.. తాజాగా మళ్లీ కలిసినట్లున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఇంతియాజ్ అలీ దర్శకత్వం వహించిన లవ్ ఆజ్ కల్(2020) సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే కార్తీక్, సారా డేటింగ్ లో ఉన్నారు. అయితే ఈ సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. సినిమా లాగానే వీరిద్దరు కూడా రిలేషన్షిప్ని ఎక్కువకాలం ముందుకు నడిపించలేకపోయారు.
తాజాగా ఈ జంట మళ్లీ కలిసినట్లు ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కార్తీక్ వైట్ టీషర్ట్ చెక్స్ షర్ట్ ధరించగా.. సారా బ్లాక్ బ్రాలెట్పై వైట్ క్రాప్ వేసుకుని ఉంది. ఇది చూసిన అభిమానులు మీ ఇద్దరూ మళ్లి కలవడం అనందంగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు.
కార్తీక్ ఆర్యన్ ప్రస్తుతం షెహజాదా, సత్య ప్రేమ్కీ కథ, ఆషికి 3, కెప్టెన్ ఇండియా, చిత్రాల్లో నటిస్తుండగా.. సారా.. మెట్రో ఇన్ డీన్స్ అనౌన్స్, గ్యాస్లైట్, నఖ్రేవాలి చిత్రాల్లో నటిస్తుంది.