Pelli Kani Prasad | టాలీవుడ్ కమెడియన్ సప్తగిరి (Sapthagiri) ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘పెళ్ళి కాని ప్రసాద్’ (Pelli Kani Prasad). ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా.. ప్రియాంక శర్మ కథానాయికగా నటించారు. ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం చిత్రబృందం ప్రెస్మీట్ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న సప్తగిరి సినిమా హీరోయిన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సినిమాలో నా పక్కన నటించడానికి చాలామంది హీరోయిన్లు రిజెక్ట్ చేశారు, పోని ఆ హీరోయిన్లకు సినిమాలుండి బిజీగా ఉన్నారా అంటే అదికూడా లేదు. సినిమాలు లేకుండా ఉన్న స్టార్ హీరోయిన్లు కూడా ఒక కామెడియన్తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. చివరకు మా అదృష్టం కొద్ది ప్రియాంక శర్మ ఓకే చెప్పారంటూ సప్తగిరి చెప్పుకోచ్చాడు. అగ్ర నిర్మాత దిల్రాజు నేతృత్వంలోని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను విడుదల చేస్తుంది.