‘పెళ్లికాని ప్రసాద్’ సినిమా చూశాను. మనస్సాక్షితో ఒక ప్రేక్షకుడిగా చెబుతున్నా. ఈ పరీక్షలో వందశాతం నాకు నేను మార్కులు వేసుకున్నాను. ఈ నెల 21న సినిమా చూశాక మీరూ మంచి మార్కులు వేస్తారని నమ్ముతున్నా. నాతోపాటు మిగతా నటీనటులంతా ఈ సినిమాలో చేసిన హడావిడీ అంతా ఇంతా కాదు. పొట్ట చెక్కలయ్యేలా నవ్విస్తుందీ సినిమా.’
అని నటుడు సప్తగిరి అన్నారు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘పెళ్లికాని ప్రసాద్’. అభిలాష్‌రెడ్డి గోపిడి దర్శకుడు. కె.వై.భాను ప్రకాష్‌గౌడ్, సుక్కా వెంకటేశ్వర్‌గౌడ్, వైభవ్‌రెడ్డి ముత్యాల నిర్మాతలు. అగ్ర నిర్మాత దిల్‌రాజు నేతృత్వంలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ఈ నెల 21న చిత్రాన్ని విడుదల చేస్తున్నది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సప్తగిరి మాట్లాడారు.
‘ఇందులో మురళీగౌడ్గా మంచి కామెడీ చేస్తా. దర్శకుడి అభిరుచి, నిర్మాతల రాజీలేని తనం వల్లే సినిమా ఇంత బాగా వచ్చింది. దిల్‌రాజుగారు ఈ సినిమాను విడుదల చేస్తుండటంతో సినిమాకు మంచి బజ్ క్రియేటైంది.’అని ఆనందం వెలిబుచ్చారు సప్తగిరి. ఇంకా దర్శకుడు అభిలాష్‌రెడ్డి, నిర్మాత కేవై బాబు, కథానాయిక ప్రియాంకశర్మ, సీనియర్ నటి అన్నపూర్ణ, నటి ప్రమోదిని కూడా ఈ సమావేశంలో మాట్లాడారు.