రెండునెలల క్రితం విడుదలైన ‘సప్తసాగరాలుదాటి సైడ్ ఎ’ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకున్న విషయం తెలిసిందే. దీంతో ‘సప్తసాగరాలుదాటి సైడ్ బి’ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హేమంత్‌రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి విడుదల చేస్తున్నారు. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా అగ్ర కథానాయిక సమంత ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. ట్రైలర్ చాలా ఆసక్తికరంగా, అందరి దృష్టినీ ఆకర్షించేలా ఉందని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని సమంత శుభాకాంక్షలు అందించారు.
‘సైడ్ ఎ’ని మించే స్థాయిలో రానున్న ‘సైడ్ బి’ ఉంటుందని, తెలుగు ప్రేక్షకుల హృదయాలను ఈ సినిమా కొల్లగొట్టడం ఖాయమని చిత్ర బృందం నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. రక్షిత్‌శెట్టి, రుక్మిణీ వసంత్, చైత్ర.జె ఆచార్ ప్రధానభూమికలు పోషించిన ఈ చిత్రానికి కెమెరా అద్వైత్ గురుమూర్తి, సంగీతం: చరణ్‌రాజ్.