Sapta sagaralu Daati (Side B) | కన్నడ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో సైడ్-ఏ’ (Sapta Sagaradaache Ello). రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి (Rukmini) కథానాయికగా నటించింది. హేమంత్ రాజ్ (Hemanth Raj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 01న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇదే సినిమాను సప్త సాగరాలు దాటి సైడ్-ఏ (Sapta Sagaralu Dhaati) అనే పేరుతో తెలుగులో సెప్టెంబర్ 22న విడుదల చేయగా.. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.
అయితే ఇది తొలిపార్టు మాత్రమే. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. మేకర్స్ రీసెంట్గా విడుదల తేదీ ప్రకటించారు. ఇక ఈ రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్-బీ (Sapta Sagaralu Dhaati Side-B) నవంబర్ 17న కన్నడతో పాటు మూడు భాషల్లో రిలీజ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఈ మూవీ నుంచి మేకర్స్ టీజర్, ట్రైలర్లను విడుదల చేయగా ప్రేక్షకుల వద్ద నుంచి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది.
ఇదిలా ఉంటే.. ఈ సినిమా మొదటి పార్ట్‌లోని సప్త సాగరాలు దాటి టైటిల్ సాంగ్ ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సప్త సాగరాలు దాటి సైడ్-బీ (Sapta Sagaralu Dhaati Side-B)లో కూడా టైటిల్ సాంగ్ ఉంటుందా అని ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ వారికి ఒక సాలిడ్ గుడ్ న్యూస్ ఇచ్చారు. ఈ సినిమా సైడ్-బీ టైటిల్ సాంగ్‌ను ఈరోజు సాయంత్రం 6:06 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ సినిమాకు సాయంత్రం 6:06 కి ఎదో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు సైడ్-బీ నుంచి ఏ అప్డేట్ ఇచ్చిన సాయంత్రం 6:06 గంటలకే విడుదల చేసింది. కాగా దీనిపై ఉన్న మిస్టరీ సైడ్-బీ చూస్తేనే తెలుస్తుందేమో చూడాలి.
The color has changed, so has the rhythm!
SSE – Side B title track at 6:06pm ♥️#SSESideBNov17 #SSDSideBNov17 #EKTSideBNov17 pic.twitter.com/43gzxxv4HY
— Rakshit Shetty (@rakshitshetty) November 10, 2023
ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. మొదటి పార్ట్ ‘సప్త సాగరే దాచే ఎల్లో (సైడ్ ఏ) సెప్టెంబర్ 01 న విడుదల కాగా.. రెండో పార్ట్ ‘సప్త సాగరే దాచే ఎల్లో (సైడ్ బీ) నవంబర్ 17న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఇక హేమంత్ రాజ్, రక్షిత్ శెట్టి కాంబోలో ఇంతకుముందు గోధి బన్న సాధారణ మైకట్టు (GBSM) సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ కన్నడలో బ్లక్ బస్టర్‌గా నిలిచింది.