Sapta sagaralu Daati (Side B) | గత ఏడాది కన్నడ నుంచి వచ్చి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న చిత్రం ‘సప్త సాగరదాచే ఎల్లో సైడ్-ఏ’ (Sapta Sagaradaache Ello). రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రంలో రుక్మిణి (Rukmini) కథానాయికగా నటించింది.హేమంత్ రాజ్ (Hemanth Raj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక ఈ చిత్రం సెప్టెంబర్ 01న కన్నడలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే ఇదే సినిమాను సప్త సాగరాలు దాటి సైడ్-ఏ (Sapta Sagaralu Dhaati) అనే పేరుతో తెలుగులో సెప్టెంబర్ 22న విడుదల చేయగా.. ఇక్కడ కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే ఇది తొలిపార్టు మాత్రమే. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ సప్త సాగరాలు దాటి సైడ్-బీ (Sapta Sagaralu Dhaati Side-B) నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయం అందుకుంది. అయితే ఈ సినిమా విడుదలై ఇన్ని రోజులైనా ఓటీటీ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. ఇక ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పడు చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తుండగా.. వారి నిరీక్షణకు తెరదించుతూ.. గుడ్ న్యూస్ చెప్పారు.
సప్త సాగరాలు దాటి సైడ్-బీ త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు రక్షిత్ శెట్టి సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ప్రముఖ ఓటీటీ దిగ్గజం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
#SSESideB is coming on Amazon soon. We will announce the date as it gets confirmed 🤗
— Rakshit Shetty (@rakshitshetty) January 20, 2024
ఈ సినిమా సైడ్-ఏ కథ విషయానికొస్తే.. మను (రక్షిత్ శెట్టి), ప్రియ (రుక్మిణీ వసంత్) అనే మధ్య తరగతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటుంటారు. పెళ్లిచేసుకుని జీవితంలో చాలా సాధించాలని, గొప్పగా ఎదగాలని కలలు కంటుంటారు. మరీ ముఖ్యంగా సముద్రం పక్కన ఓ అందమైన ఇల్లు కట్టుకుని కుంటుంబంతో కలిసి హ్యాపీగా జీవించాలని అనుకుంటారు. అయితే ఓ రాంగ్ డిసీషన్ వల్ల వీళ్ల జీవితాలు తలకిందులైపోతాయి. రక్షిత్ శెట్టి జైలుకు అంకితమైపోతాడు. అయితే పదేళ్ల అనంతరం రక్షిత్ శెట్టి జైలు నుంచి తిరిగి రావడంతో సైడ్-బీ కథ మొదలవుతుంది. జైలు నుంచి బయటకు వచ్చిన అనంతరం ప్రియ ఎక్కడ ఉందని తెలుసుకోవాలని అనుకుంటాడు మను. అందుకోసం సురభి (చైత్ర జె.ఆచార్) సాయం తీసుకుంటాడు. మరి ప్రియని మను కలిశాడా? లేదా? పదేళ్ల తర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పు వచ్చింది? అసలు మను ను జైలుకు పంపించిన వారిపై ప్రతీకారం తీర్చుకున్నాడా అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.