Sapta sagaralu Daati Movie | చెప్పా పెట్టకుండా సప్త సాగరాలు దాటి సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రైమ్‌లో గత అర్థరాత్రి నుంచి కన్నడ సహా సౌత్‌లోని అన్ని భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. సెప్టెంబర్ 1న కన్నడలో రిలీజైన ఈ సినిమా ఊహించని రేంజ్లో బంపర్ హిట్టయింది. మరీ ముఖ్యంగా యూత్‌కు ఈ సినిమా పిచ్చ పిచ్చగా నచ్చేసింది. దాంతో ఈ సినిమాను తెలుగులో వారం కిందట రిలీజ్ చేశారు. తెలుగులోనూ ఈ సినిమాకు పాజిటీవ్ రివ్యూలు వచ్చాయి. అంతేకాకుండా తొలిరోజే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ చేసుకుంది. గుండెల్ని పిండేసే సినిమా ఇదని సినిమా చూసిన వారు తమ తమ రివ్యూలను పంచుకున్నారు. అయితే పోటీగా ఈ వారం స్కంద, చంద్రముఖి-2, పెద కాపు-1 వంటి మంచి హైప్ ఉన్న సినిమాలు రావడంతో సప్తా సాగరాలు దాటి సినిమాకు బ్రేకులు పడ్డాయి.
ఇక ఇది తొలిపార్టు మాత్రమే. రెండో భాగం సప్త సాగరాలు దాటి సైడ్-బీ అక్టోబర్ 27న కన్నడతో పాటు తెలుగులోనూ రిలీజ్ కానుంది. ఈ సినిమా కథ విషయానికొస్తే.. ప్రియా అనే గాయని, మను అనే ఓ కారు డ్రైవర్ ప్రేమించుకుని పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. జీవితంలో గొప్పగా బతకాలని కలలు కంటారు. కానీ జీవితం బాగుండటం కోసం వారిద్దరూ తీసుకునే ఓ తప్పుడు నిర్ణయం వారి జీవితాన్నే మార్చేస్తుంది. ఏంటా నిర్ణయం? వారి జీవితం ఎలాంటి మలుపు తీసుకుంది? అనేది మిగతా కథ. కథనం కాస్త లాగ్ అనిపించిన ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. మరీ ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాను వేరే లెవల్‌కు తీసుకెళ్లిపోయింది. హీరో హీరోయిన్లుగా నటించిన రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ పాత్రలకు మనం కూడా ఇట్టే కనెక్ట్ అయిపోతాం.