సంతోషం సౌత్ ఇండియన్ ఫిల్మ్ అవార్డ్స్, సంతోషం ఓటీటీ అవార్డ్స్ 2025 కర్టెన్ రైజర్ ఈవెంట్ శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. సీనియర్ నటుడు మురళీమోహన్, నిర్మాత కేఎస్ రామారావు, కాజా సూర్యనారాయణ, నిర్మాత ఏడిద రాజా ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొని ‘సంతోషం’ పాత్రికాధినేత సురేశ్ కొండేటికి శుభాకాంక్షలు అందించారు. ప్రతి ఏటా ఘనంగా జరిగే సంతోషం అవార్డుల వేడుక ఈ ఏడాది కూడా జనం మెచ్చేలా జరగాలని వారంతా ఆకాక్షించారు.
24ఏండ్లుగా అవార్డుల వేడుకను నిర్వహిస్తున్న ఏకైక మేగజైన్ ‘సంతోషం’అని, సురేష్ కొండేటి ఎంతో కష్టానష్టాలకోర్చి ఈ పత్రికను ముందుకు తీసుకెళ్లడమే కాక, అవార్డు వేడుకలను కూడా అద్భుతంగా నిర్వహిస్తున్నారని మురళీమోహన్ కొనియాడారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ ‘35ఏండ్లుగా జర్నలిస్ట్‌గా ఉన్నాను. విలువలతో పత్రిక పెట్టి, పలువురు హర్షించేలా ముందుకెళ్తున్నాను. ఇక ముందు కూడా ఈ విలువలను వదులుకోను. పరిశ్రమ మెచ్చేలా వేడుక నిర్వహిస్తాం’ అని సురేశ్ కొండేటి అన్నారు.