సంతోష్ శోభన్, ప్రియ భవానీ శంకర్ జంటగా నటిస్తున్న సినిమా ‘కళ్యాణం కమనీయం’. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ నిర్మిస్తున్నది. పెండ్లి నేపథ్యంగా సాగే కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. సంక్రాంతి పండుగకు జనవరి 14న తెరపైకి రాబోతున్నది. తాజాగా ఈ చిత్ర టైటిల్ మోషన్ పోస్టర్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల మాట్లాడుతూ…‘పెండ్లి నేపథ్యంగా సాగే ఆహ్లాదకర చిత్రమిది. యువ జంట మధ్య ప్రేమానుబంధాలు ఆకట్టుకుంటాయి. సంతోష్, ప్రియా భవానీ కెమిస్ట్రీ మెప్పిస్తుంది. సకుటుంబంగా చూసేలా సినిమాను రూపొందించాం’ అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : కార్తీక్ ఘట్టమనేని, సంగీతం : శ్రావణ్ భరద్వాజ్.