Like Share And Subcribe Movie Tiltle Video Song | కొత్తదనంతో కూడిన కథాంశాలను ఎంచుకుంటూ టాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు సంతోష్ శోభన్. చేసినవి మూడు, నాలుగు సినిమాలే అయినా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం సంతోష్ శోభన్ నాలుగు సినిమాలను సెట్స్‌పై ఉంచాడు. అందులో ‘లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్’ ఒకటి. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘కృష్ణార్జున యుద్ధం’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన మేర్లపాక గాంధి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి. తాజాగా చిత్రబృందం ఈ సినిమా టైటిల్ సాంగ్ వీడియోను విడుదల చేశారు.
హిందీ షాయరీతో స్టార్ట్ అయిన ఈ సాంగ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంతోష్ శోభన్ డాన్స్ స్టెప్స్ అలరిస్తున్నాయి. ప్రవీణ్ లక్కరాజు స్వర పరిచిన ఈ పాటను స్వీకర్ అగస్తి ఆలపించగా.. శ్రీమణి సాహిత్యం అందించాడు. అడ్వేంచర్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సంతోష్‌కు జోడీగా జాతిరత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా హీరోయిన్గా నటిస్తుంది. సుదర్శన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైనమెంట్స్, అమృతా క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని నవంబర్ 4న ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.