బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ (Santhosh Soban). ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ కళ్యాణం కమనీయం (Kalyanam Kamaneeyam). కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్ ఫీమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్‌పై అనిల్ కుమార్ అల్ల డైరెక్ట్ చేస్తున్న కళ్యాణం కమనీయం జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సంతోష్ శోభన్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు. వెడ్డింగ్ బ్యాక్ డ్రాప్లో సాగే ఈ చిత్రం కోసం ప్రీ వెడ్డింగ్ షూట్ ఏర్పాటు చేశారు. యాంకర్ సునయన కెమెరామెన్‌గా మారిపోయి వధూవరులిద్దరినీ ఫన్నీగా కెమెరాలో బంధించే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత హీరోహీరోయిన్లు ఇద్దరినీ ఇంటర్వ్యూ చేసింది. ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
కాగా మేకర్స్ ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన పెళ్లి నేపథ్యంలో సాగే ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్‌తోపాటు హో ఎగిరే సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రానికి శ్రావణ్ భరద్వాజ్ సంగీతం అందించాడు. సంతోష్ శోభన్ మరోవైపు ప్రేమ్ కుమార్, అన్ని మంచి శకునములే సినిమాలు కూడా చేస్తున్నాడు.
ప్రీ వెడ్డింగ్ షూట్.. వీడియో
Watch & Enjoy Team #KalyanamKamaneeyam Funny Pre-Wedding Shoot & Hilarious Interview With #Sunaina
▶ https://t.co/y5ZQLs9x8d#KalyanamKamaneeyamFromJan14@santoshsoban @priya_Bshankar @Dir_Anilkumar #SravanBharadwaj @kk_lyricist #SatyaG@UV_Creations @UVConcepts_ @adityamusic pic.twitter.com/N1d2BK1WdP
— UV Creations (@UV_Creations) January 2, 2023
హో ఎగిరే లిరికల్ సాంగ్.. వీడియో
ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్..
Read Also : Allari Naresh | క్రేజీ టాక్.. స్టార్ హీరో సినిమాలో అల్లరి నరేశ్ ..!