విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటైర్టెనర్ ‘సంతాన ప్రాప్తిరస్తు’. సంజీవ్‌రెడ్డి దర్శకుడు. మధుర శ్రీధర్‌రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌రెడ్డి నిర్మాతలు. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా, ఏక్ మినీకథ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన షేక్ దావూద్జీ ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. త్వరలో సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్‌ని అగ్ర దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా రిలీజ్ చేశారు. ట్రైలర్ చాలాబావుందని, సినిమా కూడా తప్పకుండా ఘన విజయం సాదించాలని సందీప్‌రెడ్డి వంగా ఆశాభావం వ్యక్తం చేశారు. స్పెర్మ్ కౌంట్ తక్కువ కావడంతో తల్లిదండ్రులు కాలేకపోయిన ఓ జంట.. డాక్టర్లను ఆశ్రయించారు. వారి సలహాతో డైట్ ఫాలో అవుతూ వందరోజుల్లో తన భార్యను గర్భవతిని చేయాలనే ప్రయత్నాలు మొదలుపెడతాడు భర్త. మరి ఆ ప్రయత్నంలో తను సఫలం అయ్యాడా? అనేది ఈ సినిమా కథ. అదే కంటెంట్‌ని టీజర్లో కూడా చూపించారు. వెన్నెల కిశోర్, అభినవ్ గోమటం, మురళీధర్‌గౌడ్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి మాటలు: కల్యాణ్ రాఘవ్, కెమెరా: మహిరెడ్డి పండుగుల, సంగీతం: సునీల్ కశ్యప్.