యాక్షన్ చిత్రాలకు కొంచెం బ్రేక్‌నిచ్చి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకురాబోతున్నారు హీరో రవితేజ. కిషోర్ తిరుమల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. అషికా రంగనాథ్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ‘బెల్లా బెల్లా..’ అంటూ సాగే తొలి గీతాన్ని సోమవారం విడుదల చేశారు.
భీమ్స్ సిసిరోలియో స్వరపరచిన ఈ పాటను సురేష్ గంగుల రచించారు. ‘స్పెయిన్‌కే అందాలనిట్ట అద్దిన ఓ పూల బుట్టా.. వీధుల్లో పోతుంటే అట్టా వార్తల్లో రాయాలి చిట్టా’ అంటూ హుషారైన బీట్తో సాగిందీ గీతం. ఈ పాటలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. రవితేజ-అషికా రంగనాథ్ మధ్య కెమిస్ట్రీ కట్టిపడేసింది. ఈ చిత్రానికి ప్రొడక్షన్ డిజైన్: ఏఎస్ ప్రకాష్, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన-దర్శకత్వం: కిషోర్ తిరుమల.