అగ్ర హీరో వెంకటేష్ నటిస్తున్న తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో సంక్రాంతి స్పెషల్ సాంగ్‌కు వెంకటేష్ గాత్రాన్ని అందించారు. గతంలో ‘గురు’ సినిమాలో ఆయన పాడిన ‘జింగిడి జింగిడి..’ పాటకు చక్కటి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కోసం ఆయన మరోమారు గొంతు సవరించారు.
గురువారం ‘బిహైండ్ వీడియో’ పేరుతో ఈ పాట తాలూకు విశేషాలను పంచుకున్నారు. ఈ పాటను తానే పాడతానని వెంకటేష్ ఆసక్తిని వ్యక్తం చేశారని, సినిమాలో ఈ పాట హైలైట్‌గా నిలుస్తుందని, ప్రస్తుతం ఈ ఫెస్టివల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతున్నదని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో వెంకటేష్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. క్రైమ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించిన ఈ సినిమాలో ఐశ్వర్యరాజేష్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. భీమ్స్సిసిరోలియో సంగీతాన్నందించారు.