Sankranthiki Vasthunam | అనిల్ రావిపూడి దర్శకత్వంలో టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh) హీరోగా నటిస్తున్న చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రం 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో వెంకీ టీం ప్రమోషన్స్‌లో ఫుల్ బిజీగా ఉంది.
రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేందుకు తమదైన స్ట్రాటజీతో ముందుకెళ్తుంది సంక్రాంతికి వస్తున్నాం టీం. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా లాంచ్ చేసిన గోదారిగట్టు మీద రామచిలకవే, మీను, బ్లాక్ బస్టర్ పొంగళ్ పాటలు నెట్టింట ట్రెండింగ్ అవుతున్నాయి.
వెంకీ టీం ప్రమోషనల్ క్యాంపెయిన్‌తో నెట్టింట హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ఇటీవలే మూవీ టీంతో చేసిన ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో నంబర్ 1 స్థానంలో, ఐశ్వర్యరాజేశ్తో చేసిన ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ 6వ స్థానంలో నిలిచాయి. యూట్యూబ్ మ్యూజిక్‌లో బ్లాక్ బస్టర్ పొంగళ్, మీను, గోదారి గట్టు నంబర్ 3,6, 10 స్థానాల్లో ట్రెండింగ్‌లో నిలిచాయి.
సినిమాపై బజ్ మరింత క్రియేట్ చేశాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రమోషన్స్‌లో భాగంగా ఎంగేంజింగ్గా సాగే ఇంటర్య్వూలు, చార్ట్ బస్టర్ పాటలు, ఇంప్రెసివ్ ప్రోమోలు.. ఇలా ప్రతీ విషయం సినిమా చుట్టూ మంచి బజ్ అయ్యేలా చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఈ చిత్రంలో పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ట్రయాంగిల్ క్రైమ్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్నారు.
SSMB 29 | అడ్వెంచర్‌కు అంతా సిద్ధం.. నేడు రాజమౌళి, మహేష్ సినిమాకు కొబ్బరికాయ!