Sankranthiki Vasthunam | ఇటీవలే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాతో బాక్సాఫీస్‌ను చేస్తోంది టాలీవుడ్ యాక్టర్ వెంకటేశ్ (Venkatesh) అండ్ టీం. అనిల్ రావిపూడి దర్శకత్వం హించిన ఈ చిత్రంలో ఐశ్వర్యారాజేశ్, మీనాక్షి చౌదరి ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించారు. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తూ చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ హౌస్‌ఫుల్ షోలతో స్క్రీనింగ్ అవుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది. బ్లాక్ బస్టర్ సంభవంలో భాగంగా వెంకీ టీం ఇవాళ భీమవరంలో సందడి చేయనుంది.
రాజమండ్రిలోని శ్యామలా థియేటర్‌ను సందర్శించనుంది. అభిమానులతో కలిసి సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో పాల్గొననుంది. ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం అనిల్ రావిపూడి, వెంకటేశ్, శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ హ్యాట్రిక్ కాంబోలో విడుదలై నార్త్ అమెరికా-2.3 మిలియన్ డాలర్లు (రూ.19 కోట్లకుపైగా) రాబట్టి.. యూఎస్ఏలో ఆల్‌టైమ్ హయ్యెస్ట్ గ్రాస్ సాధించిన సినిమాగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నరేశ్, పాపులర్ మరాఠీ యాక్టర్, యానిమల్ ఫేం ఉపేంద్ర లిమాయే, కోలీవుడ్ నటుడు వీటీవీ గణేశ్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మించారు.
సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదలైన ఈ చిత్రం రీసెంట్గా వరల్డ్‌వైడ్‌గా రూ.200 కోట్ల క్లబ్‌లోకి చేరిపోవడమే కాకుండా.. వెంకీ కెరీర్ బెస్ట్ కలెక్షన్లుగా అరుదైన ఫీట్ క్రియేట్ చేసింది.
Ahead of the BLOCKBUSTER SAMBARAM at Bhimavaram, The #BlockbusterSankanthikiVasthunam Team is all set for a Theatre Visit Today💥💥
Meet the team of #SankranthikiVasthunam at Shyamala Theatre, Rajahmundry, 12PM ❤️🔥❤️🔥❤️🔥
Victory @venkymama @anilravipudi @aishu_dil @Meenakshiioffl… pic.twitter.com/isvBQsmkC0
— Sri Venkateswara Creations (@SVC_official) January 26, 2025
Gautham Vasudev Menon | ధృవ నక్షత్రం కథకు సూర్య నో చెప్పడం తట్టుకోలేకపోయా: గౌతమ్ మీనన్
SSMB29 Update | సింహన్ని లాక్ చేసిన రాజమౌళి.. SSMB29 ప్రాజెక్ట్ షూరు.!