Sankranthiki Vasthunam | టాలీవుడ్ అగ్ర నటుడు విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) చిత్రబృందానికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
విడుదల రోజు నుంచి మొదటి పది రోజులు సింగిల్ స్క్రీన్స్ లో రూ. 100 అలాగే ముల్టీప్లెక్స్ లో రూ. 125 పెంచుతూ అనుమతులు ఇచ్చింది. ఈ పెంపుతో సంక్రాంతికి వస్తున్నాం టికెట్ ధరలు రూ. 245, రూ. 175 రూ. 302 గా ఉండనున్నాయి. యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ మాజీ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గోదారి గట్టు మీద రామచిలకవే మీను సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి.