Sankranthiki Vasthunam | అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
అయితే రీసెంట్గా ఈ సినిమాను ఓటీటీలో కంటే ముందుగా టీవీలో టెలికాస్ట్ చేయబోతున్నట్లు వార్తలు వచ్చాయి. నిర్మాతలు కూడా దీనికి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది. ఇదిలావుంటే టీవీ కంటే ముందుగానే ఈ మూవీ ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ని పంచుకుంది.
ఈ సినిమా ఓటీటీ హక్కులతో టీవీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సరదాగ ఒక పోస్ట్ పెట్టింది. ఈ పోస్ట్‌లో ”ఏమండోయ్.. వాళ్లు వస్తున్నారు. మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచి చూడండి”. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటిస్తాం అంటూ జీ5 రాసుకోచ్చింది. దీనికి సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunam Coming Soon) కమింగ్ సూన్ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. దీంతో త్వరలోనే ఓటీటీ డేట్‌ని ప్రకటించబోతున్నట్లు తెలుస్తుంది.
Evandoi! Vaallu vastunnaru!
Marinni vivaralu, kuusantha chamatkaram kosam vechi chudandi🙏🏼#2025BlockBuster #ComingSoon #ZEE5 #Zee5Telugu pic.twitter.com/K8sTACXngn
— ZEE5 Telugu (@ZEE5Telugu) February 20, 2025