వెంకటేష్ కథానాయకుడిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్రాజు, శిరీష్ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ బరిలో రికార్డు వసూళ్లతో సంచలనం సృష్టిస్తున్నది. ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా వారం రోజుల్లోనే 203కోట్లకు పైగా కలెక్షన్స్ను సాధించిందని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
తెలుగు రాష్ర్టాలతో పాటు అమెరికాలో కూడా రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతున్నదని, అక్కడ ఇప్పటివరకు 2.3 మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసిందని మేకర్స్ తెలిపారు. వీటితో పాటు వెంకటేష్ కెరీర్లోనే అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ‘సంక్రాంతికి వస్తున్నాం’ నిలవడం విశేషం. మరోవారం పాటు పెద్ద చిత్రాల రిలీజ్లు లేకపోవడంతో ‘సంక్రాంతికి వస్తున్నాం’కలెక్షన్స్ మరింతగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.