Sankranthiki Vasthunam | టాలీవుడ్లో సూపర్ హిట్ అందుకున్న సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) చిత్రం బాలీవుడ్‌కి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను హిందీ ప్రేక్షకులకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ అగ్ర నటుడు అక్షయ్ కుమార్ ఈ సినిమాలో హీరో అయితే బాగుంటుందని దిల్ అనుకుంటున్నట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం ఈ రీమేక్ చర్చ దశలోనే ఉండగా.. అధికారిక ప్రకటన కోసం వేచిచూడాల్సి ఉంది.
విక్టరీ వెంకటేష్(Victory Venkatesh) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh) హీరోయిన్లుగా నటించారు. జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వచ్చి బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా.. రూ.300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. థియేటర్లలో అలరించిన ఈ చిత్రం రీసెంట్గా ఓటీటీ అనౌన్స్‌మెంట్‌ని కూడా పంచుకుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5లో ఈ సినిమా త్వరలోనే స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వెల్లడించింది.