Sankranthiki Vasthunam | టాలీవుడ్ అగ్ర నటుడు విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ మాజీ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి.
అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా ట్రైలర్ వేడుకను నిజామాబాద్ జిల్లాలో నిర్వహించబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ నెల 06న నిజామాబాద్ కలెక్టర్ గ్రౌండ్లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. గతంలో అనిల్ రావిపూడి, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు ఘన విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో మూడో సినిమా వస్తుడటంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు.
After a chartbuster MUSICAL ALBUM 🥁
It’s time for the BLOCKBUSTER TRAILER ❤️🔥#SankranthikiVasthunam Trailer On January 6th🥳
Launch Event at Collector Ground, Nizamabad 💥#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025.
Victory @VenkyMama @AnilRavipudi… pic.twitter.com/glp9CSXF5Y
— Sri Venkateswara Creations (@SVC_official) January 3, 2025