Sankranthiki Vasthunam | టాలీవుడ్ అగ్ర నటుడు విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam). యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్ మాజీ గర్ల్ ఫ్రెండ్ గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గోదారి గట్టు మీద రామచిలకవే మీను సాంగ్స్ ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచాయి.
అయితే ఈ సినిమాలో సంక్రాంతికి సంబంధించిన ఒక సాంగ్ ఉందని తెలుస్తుంది. ఈ పాటను బాలీవుడ్ లేదా సౌత్ ఇండస్ట్రీలో ఉన్న సింగర్స్‌తో పాడిద్దాం అని చూస్తుంటే.. నేనే పాడుతానని ముందుకోచ్చాడు వెంకటేష్. అయితే వెంకీ మామ పాడుతానని అనిల్‌ను టార్చర్ చేయడంతో పాట పాడేందుకు ఒప్పుకున్నాడు అనిల్ రావిపూడి. అయితే వెంకటేశ్ పాడిన బ్లాక్‌బస్టర్ పోంగల్ (Block buster Pongal) సాంగ్‌ను డిసెంబర్ 30న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
Get ready for Victory @VenkyMama’s special mass treat 🔥#SankranthikiVasthunam third single #BlockbusterPongal out on 30th December💥💥
A #Bheemsceciroleo Musical 🥁#సంక్రాంతికివస్తున్నాం GRAND RELEASE WORLDWIDE ON 14th JANUARY, 2025❤️🔥@AnilRavipudi @aishu_dil… pic.twitter.com/gc4gCl3RRW
— BA Raju’s Team (@baraju_SuperHit) December 27, 2024