RC 16 Movie | టాలీవుడ్ హీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఆర్సీ 16. ఈ చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో జాన్వీకపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shiva Rajkumar) కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో విలన్ రోల్‌కి సంబంధించి ఒక సాలిడ్ రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.
ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ మూవీ స్టోరీ లైన్ నచ్చి సంజయ్‌దత్ ఓకే చెప్పనట్లు సమాచారం. కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఉత్తరాంధ్ర స్పోర్ట్స్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు విజేత ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించనుండగా.. మైత్రీమూవీ మేకర్స్ సమర్పిస్తున్నది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలపై వెంకటసతీశ్ కిలారు అత్యంత భారీ వ్యయంతో ఈ సినిమాను నిర్మించనున్నారు. యూనివర్సల్ అప్పీల్ ఉండే పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని బుచ్చిబాబు సిద్ధం చేశారని యూనిట్ సభ్యులు తెలిపారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది.