Love And War | బాలీవుడ్ స్టార్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో మరోసారి చేతులు కలపనున్నాడు. ఇప్పటికే ఈ దిగ్గజ దర్శకుడు రణ్‌బీర్ కపూర్‌తో సావరియా చిత్రం తెరకెక్కించిన విషయం తెలిసిందే. రణ్‌బీర్ కపూర్ సోనమ్ కపూర్ హీరో హీరోయిన్లుగా వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
అయితే ఈ సినిమా అనంతరం దాదాపు 17 సంవత్సరాల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో సినిమా రాబోతుంది. రణ్‌బీర్ కపూర్, భన్సాలీ కాంబోలో వస్తున్న తాజా చిత్రం లవ్ అండ్ వార్(). అలియా భట్ హీరోయిన్గా నటిస్తుండగా.. విక్కీ కౌశల్ కీలక పాత్రలో నటించబోతున్నాడు. తాజాగా ఈ చిత్రం విడుదల తేదీని సంజయ్ లీలా భన్సాలీ అధికారికంగా ప్రకటించాడు. ఈ సినిమాను మార్చి 20 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వెల్లడించాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతున్నట్లు ప్రకటించాడు. ఇటీవల హీరామండి అనే వెబ్ సిరీస్‌ను తెరకెక్కించి మంచి విజయాన్ని అందుకున్నాడు భన్సాలీ. ఇండిపెండెన్స్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ వెబ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు వ్యూస్ సాధించింది.
RANBIR KAPOOR – ALIA BHATT – VICKY KAUSHAL: SANJAY LEELA BHANSALI FINALISES RELEASE DATE… 20 March 2026 is the release date of #SanjayLeelaBhansali’s next film, titled #LoveAndWar… Stars #RanbirKapoor, #AliaBhatt and #VickyKaushal. pic.twitter.com/tZm84YwWeQ
— taran adarsh (@taran_adarsh) September 13, 2024