బాలీవుడ్ చిత్రసీమలో విలక్షణ దర్శకుడిగా పేరు పొందారు సంజయ్‌లీలా భన్సాలీ. ఆయన చిత్రాల్లో భారీతనంతో పాటు చక్కటి కళాత్మక విలువలు కనిపిస్తాయి. గత ఏడాది ‘గంగూభాయి కతియావాడి’ చిత్రంతో మంచి విజయాన్ని దక్కించుకున్నారు. అలియాభట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కావడమే కాకుండా విమర్శకుల ప్రశంసలందుకుంది. దీంతో సంజయ్‌లీలాభన్సాలీ తదుపరి ప్రాజెక్ట్ ‘బైజూ బావ్రా’ అందరిలో ఆసక్తిని పెంచుతున్నది. దాదాపు ఇరవై ఏండ్లుగా ఈ స్క్రిప్ట్‌పై తాను పనిచేస్తున్నానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు సంజయ్‌లీలా భన్సాలీ.
తాజా సమాచారం ప్రకారం సంగీత నేపథ్యంలో సాగే కథాంశమిదని, ఇద్దరు సంగీత కారుల జీవన సంఘర్షణకు అద్దం పడుతుందని అంటున్నారు. ఇప్పటివరకు ఎవరూ చర్చించని ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌తో సంజయ్‌లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారని తెలిసింది. ఈ చిత్రంలో రణ్‌వీర్‌సింగ్, అలియాభట్ నాయకానాయికలుగా నటిస్తారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారు సంజయ్‌లీలా భన్సాలీ.