సినిమాలకు అంగీకరించే ముందు కథానాయికలు కొన్ని కండిషన్స్ పెట్టడం సహజమే. ముఖ్యంగా అగ్ర నాయికలు ఈ విషయంలో మరింత పట్టుదలతో ఉంటారు. బాలీవుడ్ అగ్ర కథానాయిక సోనాక్షి సిన్హా తెరపై బోల్డ్ సన్నివేశాల్లో నటించడానికి అస్సలు అంగీకరించదట. చిన్న ముద్దు సీన్ కూడా ఉండటానికి వీల్లేదని చెబుతుందట. కెరీర్ ఆరంభం నుంచి ఈ నియమాన్ని పాటిస్తున్నాని చెప్పుకొచ్చిందీ అమ్మడు. ‘నా కెరీర్లో 30కి పైగా సినిమాలు చేశాను. ఇప్పటివరకు ఒక్క శృంగార సన్నివేశంలో కూడా నటించలేదు. బోల్డ్ సీన్స్ అస్సలు ఉండొద్దని దర్శకనిర్మాతలకు ముందే చెబుతాను. ఒకవేళ షూటింగ్ మధ్యలో అలాంటి సీన్స్ చేయాలని రిక్వెస్ట్ చేసినా ఒప్పుకోను. అవసరమైతే సినిమా నుంచి తప్పుకుంటాను కానీ అలాంటి దృశ్యాల్లో నటించడానికి దూరంగా ఉంటాను. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. దర్శకనిర్మాతలు నేను పెట్టే కండిషన్స్‌కు అంగీకరించినప్పుడే సినిమాకు సైన్ చేస్తాను’ అని చెప్పింది సోనాక్షి సిన్హా. సంజయ్‌లీలా భన్సాలీ దర్శకత్వంలో ఆమె నటించిన ‘హీరామండీ’ సిరీస్ ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నది.