Sanjay Dutt | బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీపై పూర్తిగా ఫోకస్ పెట్టారు. ‘కేజీఎఫ్ 2’లో భయపెట్టించే విలన్‌గా సందడి చేసిన ఆయన, తర్వాత తమిళంలో ‘లియో’లో విజయ్‌కు బాబాయ్‌గా కనిపించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం తెలుగులో ‘ది రాజా సాబ్’, ‘అఖండ 2’ వంటి ప్రాజెక్టుల్లో నటిస్తుండగా, తాజాగా కన్నడ సినిమా ‘కేడీ ది డెవిల్’ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో హీరోగా ధ్రువ్ సర్జా, హీరోయిన్గా శిల్పా శెట్టి నటిస్తున్నారు.హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రమోషన్ కోసం వచ్చిన సంజయ్ దత్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ‘లియో’ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.
లియో చిత్రంలో నటించడం ఆనందంగానే ఉంది కానీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్‌పై నాకు కోపం ఉంది. నాకు ఇచ్చిన పాత్ర చాలా చిన్నది. నా ఇమేజ్‌కి సరిపడా రోల్‌ను డిజైన్ చేయలేకపోయాడు. నిజంగా చెప్పాలంటే నన్ను సరిగ్గా వాడుకోలేకపోయాడు. అయితే షూటింగ్ సమయంలో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశాను అంటూ సంజయ్ దత్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ఇప్పటికే ‘లియో’లో సంజయ్ పాత్ర నిడివి చాలా తక్కువగా ఉందని ప్రేక్షకులు కూడా విమర్శించారు. ఇప్పుడు ఆయన స్వయంగా అదే చెప్పడంతో, అప్పట్లో వచ్చిన అనుమానాలు నిజమైపోయినట్లయ్యింది. విలన్ పాత్ర పోషించిన స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండడం తనకూ అసంతృప్తిని ఇచ్చినట్లే తెలుస్తోంది.
ఇక బాలీవుడ్‌పై కూడా సంజయ్ దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఈ మధ్య బాలీవుడ్లో ప్యాషన్ తగ్గిపోయింది. సినిమాలు హిట్ కొట్టాలనే ఆశ తప్ప, మంచి సినిమాలు తీయాలన్న తపన కనిపించడం లేదు. కానీ టాలీవుడ్, కోలీవుడ్ వంటి ఇండస్ట్రీల్లో మాత్రం మంచి ప్యాషన్ ఉంది. అందుకే ఇక్కడి సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో హిట్లు కొడుతున్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సంజయ్ దత్. ప్రస్తుతం సంజూభాయ్ కామెంట్స్ నెట్టంట వైరల్‌గా మారాయి.