‘కేజీఎఫ్-2’ చిత్రంలో అధీరా పాత్రలో అద్భుతమైన విలనీ పండించి ఆకట్టుకున్నారు సీనియర్ నటుడు సంజయ్‌దత్. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘డబుల్ ఇస్మార్ట్’లో సైతం ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా సంజయ్‌దత్ భారీ పాన్ ఇండియా చిత్రంలో భాగం కాబోతున్నారు. ‘యురి- ది సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్యదర్ దర్శకత్వంలో ‘దురంధర్’ పేరుతో మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కనుంది.
ఇందులో రణ్‌వీర్‌సింగ్, ఆర్.మాధవన్, అర్జున్ రాంపాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్ కథాంశమిదని సమాచారం. విదేశాల్లో చేపట్టిన ఆపరేషన్‌ను ఇండియన్ గూఢచారులు ఎలా విజయవంతం చేశారన్నదే చిత్ర ఇతివృత్తమని సమాచారం. ఈ చిత్రంలో సంజయ్‌దత్ భాగం కాబోతున్నారు. ఇందులో ఆయన క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో సాగుతుందని సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీప్రొడక్షన్స్ కార్యక్రమాలను జరుపుకుంటున్నది.