Robinhood | టాలీవుడ్ హీరో నితిన్ (Nithiin), వెంకీ కుడుముల (Venky Kudumula) కాంబోలో వస్తున్న తాజా చిత్రం రాబిన్‌హుడ్ (Robinhood). భీష్మ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల చేసిన గ్లింప్స్‌తో పాటు ఫస్ట్ లుక్‌లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలావుంటే తాజాగా ఈ సినిమా నుంచి ఒక సాలిడ్ న్యూస్ బయటకు వచ్చింది.
ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్ కీలకపాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. నితిన్‌కు ఉన్న పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని సంజయ్‌దత్ ఈ సినిమాకు తీసుకున్నట్లు టాక్ నడుస్తుంది. దీనిపై చిత్రయునిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
నితిన్ ఈ సినిమాలో దొంగగా కనిపించబోతున్నాడు. టకిరిటీ రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవి శంకర్ నిర్మి్స్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఈ చిత్రానికి సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫర్ కాగా.. ప్రవీణ్ పూడి ఎడిటర్. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్.