ఎప్పుడు వివాదాలతో వార్తలలో నిలిచే సంజన తాజాగా క్యాబ్ డ్రైవర్‌తో గొడవపడి వార్తలలోకి ఎక్కింది. మంగళవారం ఉదయం షూటింగ్ స్పాట్‌కు వెళ్లడానికి బెంగళూరులోని ఇందిరానగర్ నుంచి రాజరాజేశ్వరినగర్ కి క్యాబ్ బుక్ చేసిన సంజన క్యాబ్ ఎక్కాక గమ్యం మార్చాలని అతడిని కోరిందట. దీంతో అతడు కస్టమర్ కేర్‌కి కాల్ చేసి అడిగాడు, కాని లొకేషన్ మార్చలేదు.దీంతో ఆమె క్యాబ్ డ్రైవర్‌పై ఫైర్ అయింది.
ఈ తతంగాన్ని క్యాబ్ డ్రైవర్ వీడియో తీసి అకారణంగా నాపై సంజన దుర్భాషలాడిందంటూ రాజరాజేశ్వరినగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇక సంజన కూడా క్యాబ్ లో ఉండగానే 100కి కాల్ చేసి డ్రైవర్‌పై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. క్యాబ్ డ్రైవర్ తనను చెప్పిన చోటుకు తీసుకెళ్లలేదని సోషల్ మీడియాలో ఆరోపించారు. కారులో ఏసీని పెంచాలని అడిగితే డ్రైవర్ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడని, కారు డోర్ కూడా సరిగాలేదని ఆమె ఆరోపించారు.. అలాగే అడిగినంత డబ్బులు ఇచ్చి కూడా ఇటువంటి డొక్కు కారులో వెళ్లాలా అని సంజన తన ట్విట్టర్లో రాసుకొచ్చింది. ప్రస్తుతం సంజన టాపిక్ నెట్టింట చర్చనీయాంశంగా మారింది.