సంగీత్శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ధీరజ్ మొగిలినేని, గిరిబాబు వల్లభనేని నిర్మిస్తున్నారు.
ట్రెండీ లవ్‌స్టోరీతో ఈ సినిమాను తెరకెక్కించబోతున్నామని, ‘ది గర్ల్‌ఫ్రెండ్’తో ఇటీవలే మంచి విజయాన్ని అందుకున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న మూడో చిత్రమిదని, మరిన్ని వివరాలను త్వరలో వెల్లడిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్, రచన: లక్ష్మీభూపాల్, దర్శకత్వం: పల్నాటి సూర్యప్రతాప్.