Sandhya Theatre Stampede – Sukumar | పుష్ప 2 సినిమా బెనిఫిట్ షోలో భాగంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా.. ఆమె కొడుకు శ్రీతేజ్ తొక్కిసలాటలో గాయపడి ఆసుపత్రిలో చికిత్సా పొందుతున్నాడు.
అయితే శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకోవడానికి ఇప్పటికే హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌తో పాటు అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ ఆసుపత్రికి వెళ్లి పరామర్శించిన విషయం తెలిసిందే. తాజాగా పుష్ప దర్శకుడు సుకుమార్ కూడా ఆసుపత్రికి వెళ్లి శ్రీతేజ్‌ను పరామర్శించాడు. అనంతరం అక్కడే ఉన్న శ్రీతేజ్ కుటంబ సభ్యులతో మాట్లాడి.. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రేవతి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని తెలిపారు. మరోవైపు శ్రీతేజ్ తండ్రికి ఆర్థిక సహాయం కింద సుకుమార్ భార్య రూ.5 లక్షలు అందించినట్లు సమాచారం.
అసలు ఏం జరిగిందంటే.. పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా డిసెంబర్ 4 రాత్రి.. హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఉన్న సంధ్య థియేటర్‌కి అల్లు అర్జున్ వచ్చాడు. దీంతో అక్కడ ఫ్యాన్స్ పోటెత్తడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా బాలుడు శ్రీ తేజ్ తీవ్ర అస్వస్థతకి గురయ్యాడు. గత 15 రోజులుగా శ్రీతేజ్ కిమ్స్‌లో మృత్యువుతో పోరాడుతున్నాడు.