Santosh Movie Ban | అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్న భారతీయ చిత్రం సంతోష్()పై ఇండియాలో బ్యాన్ విధించినట్లు చిత్ర దర్శకురాలు సంధ్యా సూరి తాజాగా ఆవేదన వ్యక్తం చేసింది. బ్రిటిష్-ఇండియన్ దర్శకురాలు సంధ్యా సూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం సంతోష్. బాలీవుడ్ నటి షహానా గోస్వామి(Shahana Goswamy) ఈ మూవీలో కథానాయికగా నటించింది. ఈ చిత్రం జూలై 17 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా.. ఇండియాలో మాత్రం విడుదలపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) నిషేధం విధించింది.
ఈ సినిమాలో పోలీసుల హింసతో పాటు కుల వివక్ష, లింగ వివక్ష, ముస్లింలపై ఇండియాలో దాడులకు సంబంధించి సున్నితమైన అంశాలను ప్రస్తవించడంతో.. ఆ అంశాలను కత్తిరించాలని సీబీఎఫ్సీ సంధ్యా సూరిని కోరింది. అయితే ఈ సినిమాలో కత్తిరింపులు చేస్తే.. మూవీ తన ఆత్మనే కోల్పోతుందని అందుకే కట్ చేయనని సీబీఎఫ్‌సీకి చెప్పానని సంధ్యా వెల్లడించింది. ఇక ఇండియాలో ఈ సినిమాకు సెన్సార్ అనుమతి నిరాకరించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి, కొందరు దీనిని సెన్సార్షిప్ సమస్యగా అభివర్ణిస్తుండగా.. మరికొందరు బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సెన్సార్ బోర్డ్ తనకు నచ్చినట్లుగా వ్యవహారిస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
సంతోష్ సినిమా కథ విషయానికి వస్తే.. భర్త మరణానంతరం తన ఉద్యోగాన్ని పొందిన ఓ భార్య కథ ఇది. ఇందులో షహానా గోస్వామి.. సంతోష్ అనే కానిస్టేబుల్ పాత్రలో కనిపించగా.. తన భర్త మరణం తర్వాత పోలీస్‌గా ఉద్యోగంలో చేరిన సంతోష్‌కి అనుకోకుండా ఒక దళిత బాలిక హత్య కేసును విచారణకు వస్తుంది. అయితే ఈ కేసు విచారణ సందర్భంగా సంతోష్ వ్యక్తిగతంగా, వృత్తి పరంగా సమాజంలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొందనే కథాంశం ఆధారంగా రూపొందిన చిత్రమిది. ఈ చిత్రం విడుదలకు ఇండియా నుంచి అభ్యంతరాలు రావడంతో వరల్డ్ వైడ్‌గా విడుదల చేయగా.. యూకే ప్రభుత్వంకి ఈ సినిమా నచ్చి అక్కడి నుంచి ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్‌కి పోటి చేసింది. అయితే మన చిత్రాలను వేరే దేశం నుంచి పోటీకి పంపాల్సిన అవసరం ఏంటంటూ నెటిజెన్ల కామెంట్లు పెడుతున్నారు