Kingdom Promotions | టాలీవుడ్ స్టార్ కథానాయకుడు విజయ్ దేవరకొండ మరో వారం రోజుల్లో(జూలై 31) కింగ్డమ్(Kingdom) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్టైనమెంట్స్పై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. యాక్షన్ బ్యాక్డ్రాప్లో రాబోతున్న ఈ చిత్రంలో భాగ్యశ్రీ భోర్సే కథానాయికగా నటిస్తుండగా.. సత్యదేవ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. జూలై 31న ఈ సినిమా రాబోతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్తో పాటు ట్రైలర్ వేడుకను తిరుపతిలో ప్లాన్ చేసిన చిత్రబృందం మీడియాతో చిట్ చాట్ కాకుండా ప్రమోషన్స్ని ఇంటర్వ్యూలతో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే.. టాలీవుడ్ స్టార్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కింగ్డమ్ ప్రమోషన్ ఇంటర్వ్యూ నిర్వహించింది. దీనికి సంబంధించిన వీడియో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. విజయ్ దేవరకొండ, సందీప్ వంగా, దర్శకుడు గౌతమ్ తిన్ననూరి కలిసి ఉన్న ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#Kingdom Boys…!! ❤️🔥🤙#VijayDeverakonda #SandeepReddyVanga #GauthamTinnanuri pic.twitter.com/nO7OEMMfcA
— Suresh PRO (@SureshPRO_) July 24, 2025