సందీప్‌రెడ్డి షరతుల చిట్టా?
ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాల షూటింగుల్లో అగ్రహీరో ప్రభాస్ బిజీగా ఉన్నారు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్' స్క్రిప్ట్, ప్రీప్రొడక్షన్ పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ప్రభాస్ తాను చేస్తున్న రెండు సినిమాలను ముగించే వరకూ సందీప్‌రెడ్డి సైలెంట్‌గానే ఉంటారట.
ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాల షూటింగుల్లో అగ్రహీరో ప్రభాస్ బిజీగా ఉన్నారు. దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ‘స్పిరిట్’ స్క్రిప్ట్, ప్రీప్రొడక్షన్ పనుల్లో క్షణం తీరిక లేకుండా ఉన్నారు. ప్రభాస్ తాను చేస్తున్న రెండు సినిమాలను ముగించే వరకూ సందీప్‌రెడ్డి సైలెంట్‌గానే ఉంటారట. ‘స్పిరిట్’ లొకేషన్లోకి ప్రభాస్ ఎంట్రీ ఇచ్చాక, ఇక పూర్తిగా తన ఆధీనంలోనే ఉండాలనే షరతుని ప్రభాస్ ముందుంచారట సందీప్‌రెడ్డి వంగా. ఇంకా ప్రభాస్ ముందు ఆయన ఉంచిన షరతులు ఇలా ఉన్నాయి. ‘ ‘స్పిరిట్’ పూర్తయ్యే వరకూ మరో సినిమా చేయకూడదు. ఆ లుక్‌తో బయట కనిపించకూడదు.
వారానికి ఒకరోజో, రెండ్రోజులో కాల్షీట్లు ఇస్తే కుదరదు.. బంచ్‌గా కాల్షీట్లు కావాలి. బాడీ డబుల్స్‌పై ఆధారపడి షాట్లు తీయను.. నా లొకేషన్లో డూప్ ప్రస్తావన రాకూడదు..’ ఇవీ సందీప్‌రెడ్డి కండీషన్లు. హీరో అనేవాడు సందీప్‌రెడ్డి వంగాకి సరండర్ అయితే.. అతను ఎలాంటి అవుట్‌పుట్ ఇస్తాడో.. అర్జున్‌రెడ్డి, యానిమల్ సినిమాలు చెప్పేశాయి. అందుకే ప్రభాస్ కూడా ‘సరే’ అన్నారట. ప్రస్తుతం ఈ షరతుల చిట్టా ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నది. ‘స్పిరిట్’లో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్‌ఆఫీసర్‌గా కనిపించనున్న విషయం తెలిసిందే. కరీనాకపూర్, సైఫ్ అలీఖాన్ దంపతులు ఇందులో విలన్లుగా నటిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఏడాది చివర్లోకానీ, 2027 ప్రథమార్ధంలోగానీ ‘స్పిరిట్’ విడుదలయ్యే అవకాశం ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ అత్తి సతీశ్‌కు గాయాలు
Food Poison | నర్సాపూర్‌లో ఫుడ్ పాయిజన్ కలకలం.. రెస్టారెంట్లో భోజనం చేసిన తర్వాతే..!
ఎదుళ్ల నుండి డిండిని అడ్డుకోవద్దు : శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Zelensky: రష్యా దాడి.. 6 లక్షల మంది అంధకారంలో: జెలెన్స్కీ
SriLankan Tamil Engineer | శ్రీలంక తమిళ ఇంజినీర్‌కు ఊరట.. మరణశిక్షను రద్దు చేసిన సౌదీ సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

