కేశ సుందరి!
జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే! అందరిలో అందంగా కనిపించాలంటే కొప్పును పెంచాలి. కొత్త జడలు వేయాలి. ఆ జుట్టుని ఇంకాస్త పెంచి రికార్డుల్లోకి ఎక్కడంతో రేణు దరియాల్ వార్తల్లోకి ఎక్కింది. కత్తెర పడకుండా, రాలకుండా కాపాడుకున్న జుట్టు పెరుగుతూ.. పెరుగుతూ ప్రపంచ రికార్డుని చుట్టేసింది.
జుట్టున్నమ్మ ఏ కొప్పు వేసినా అందమే! అందరిలో అందంగా కనిపించాలంటే కొప్పును పెంచాలి. కొత్త జడలు వేయాలి. ఆ జుట్టుని ఇంకాస్త పెంచి రికార్డుల్లోకి ఎక్కడంతో రేణు దరియాల్ వార్తల్లోకి ఎక్కింది. కత్తెర పడకుండా, రాలకుండా కాపాడుకున్న జుట్టు పెరుగుతూ.. పెరుగుతూ ప్రపంచ రికార్డుని చుట్టేసింది. ఈ భూమి మీద నివసించి ఉన్న మహిళల్లో అత్యంత పొడవైన జుట్టు కలిగిన మహిళగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోకి ఎక్కింది.
ఆమె జుట్టు పొడవెంతో తెలుసా? అచ్చంగా 8 అడుగుల 10 అంగుళాలు! నిలువెత్తు కేశాలున్న ఆమె ముందు ‘నకశిఖ పర్యంతమూ’ అనే మాట చెల్లదు! ఉత్తరాఖండ్‌లోని హల్దానీలో నివసించే రేణు ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి జుట్టుని సెంటీ మీటరు కూడా కత్తిరించలేదట. అలా అలా పెంచుకుంటూ ఉక్రెయిన్ మహిళ పేరిట ఉన్న వరల్డ్ రికార్డ్‌ని బ్రేక్ చేసింది.
‘ఇంత పొడవైన జుట్టు ఎట్లా పెంచావ’ని అడిగితే ‘కెమికల్స్‌కి దూరంగా ఉన్నాను. హోమ్ మేడ్, నేచురల్ ఉత్పత్తులు మాత్రమే ఉపయోగించాను’ అని సమాధానం చెబుతుంది రేణు. పొడవైన జుట్టుతో స్నానం చేయడం, దువ్వడం కష్టం. అయినా రోజులో కొన్ని గంటల సమయం కేశ సంస్కారానికే కేటాయించానని ఆమె చెప్పింది. చూపరులను తనవైపు తిప్పుకొనేంత పొడవైన కేశాలున్న రేణు అందం కోసం పాటించాల్సిన పద్ధతులను యూట్యూబ్‌లో వివరిస్తూ సౌందర్య పాఠాలు చెబుతుంటుంది.
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

