వ్యవసాయం చేయాలనుకున్నా..
అలియా భట్, దీపికా పదుకొణె లాంటి అగ్రతారలేలుతున్న బాలీవుడ్‌ను తనదైన నటనతో మెప్పించింది యామీ గౌతమ్. ఒకప్పుడు టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు అన్నీ ఫ్లాప్లే ఎదురవ్వడంతో బాలీవుడ్ బాటపట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
అలియా భట్, దీపికా పదుకొణె లాంటి అగ్రతారలేలుతున్న బాలీవుడ్‌ను తనదైన నటనతో మెప్పించింది యామీ గౌతమ్. ఒకప్పుడు టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు అన్నీ ఫ్లాప్లే ఎదురవ్వడంతో బాలీవుడ్ బాటపట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. వరుస హిట్లతో జోరుమీదున్న ఈ భామ ‘ఆర్టికల్ 370’ చిత్రంలో అద్భుతమైన నటనకు గాను ఇటీవలే జాతీయ ఉత్తమ నటి అవార్డు కైవసం చేసుకున్నది. నటిగా మాత్రమే కాకుండా ఇల్లాలిగా, తల్లిగా నిజ జీవితంలోనూ బహుముఖ పాత్రలు పోషిస్తున్న ఈ ఉత్తరాది బ్యూటీ పంచుకున్న కార్వాన్ కబుర్లివి.
నేను హిమాచల్ప్రదేశ్లోపుట్టి చండీగఢ్‌లో పెరిగాను. నాన్న ముఖేష్ గౌతమ్ పంజాబీ సినీ డైరెక్టర్. చిన్నప్పటినుంచి చదువంటే ఇష్టం. ఐఏఎస్కావాలన్నది నా లక్ష్యం.ఇంటర్మీడియెట్ అయ్యాక,ఎల్ఎల్బీలో చేరి ఆ తర్వాతనా నిర్ణయం మార్చుకొని సినిమాల్లోకి వచ్చాను. అందుకోసం మోడలింగ్ చేశా. టీవీసీరియల్స్, పలు షోల్లో పాల్గొంటూ కన్నడ చిత్రం ‘ఉల్లాస ఉత్సాహ’తో వెండితెరకు పరిచయమయ్యాను.
టాలీవుడ్లో నేను చేసినవికొన్ని సినిమాలే అయినా ఇక్కడి ప్రేక్షకులు మాత్రం ఎంతగానో ఆదరించారు. కష్టపడ్డ వారికి
ప్రతిఫలం కూడా దక్కాలి కదా! చేసిన సినిమాలు అనుకున్న స్థాయిలో విజయంసాధించకపోవడంతో బాలీవుడ్ బాట పట్టాల్సి వచ్చింది. కానీ ఇక్కడి నేచర్ అంటే ఎంతో ఇష్టం.
‘బాలా’ సినిమా షూటింగ్సమయంలో సీరియల్స్లోచేసిన నటికి కామెడీ సినిమాలో నటించే సామర్థ్యం లేదనికొంతమంది హేళన చేశారు. నిజంగా అలాంటిదే జరిగి, సినిమా అవకాశాలు రాకపోతే హిమాచల్‌ప్రదేశ్‌కు వెళ్లివ్యవసాయం చేయాలని
నిర్ణయించుకున్నాను. కానీ,ఆ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్నది.
మూస ధోరణులకుభిన్నంగా సాగిపోవడమే నా లక్ష్యం. కథను ఎంచుకునేసమయంలో అది ఎంతభిన్నంగా ఉందనేది గమనిస్తాను. ఆ కథ ముందు నన్ను ఉత్తేజపరిస్తేనే ఓకే చెబుతాను.‘విక్కీ డోనర్’ స్క్రిప్ట్లోనూఅదే ఆలోచించాను. సంచలనాల కోసం కాకుండా ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చిన చిత్రమది.
ఒకటికి రెండుసార్లు స్క్రిప్ట్ చదువుతాను. రిహార్సల్స్ చేస్తాను. పాత్రకు కావాల్సిన కసరత్తులు చేస్తాను. ‘ఆర్టికల్ 370’లో జూనీ హక్సర్ పాత్ర కోసం ఫిట్నెస్ కోచ్ దగ్గర నాలుగు నెలలపాటు శిక్షణ తీసుకున్నాను. ‘హక్’లో భర్తకు ట్రిపుల్ తలాక్ ఇచ్చి వదిలేసిన తర్వాత హక్కుల కోసం ఎంతకైనా తెగించే ధైర్యవంతురాలైన షాజియా బానో పాత్ర నాది. ఆ పాత్ర నేపథ్యం అర్థం చేసుకోవడానికి నాలుగు నెలలపాటు ఖురాన్ అధ్యయనం చేశాను.
నా కొడుక్కి ఇప్పుడు రెండేండ్లు. వాడిని ఇంట్లో ఉంచిసెట్కు వెళ్లినప్పుడునా హృదయంలోని ఒక భాగాన్ని అక్కడే వదిలినట్లు అనిపిస్తుంది. ఇంటికి, సెట్‌కు మధ్య బ్యాలెన్స్ చేసుకోవడానికి సరైన మార్గం అంటూ ఏదీ లేదు.ప్రాధాన్యాలను బట్టి సర్దుబాటు చేసుకుంటూ ముందుకు సాగడమే.
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

