ప్రస్తుతం ప్రభాస్ వర్క్ మోడ్‌లో ఉన్నారు. రీసెంట్గా ‘స్పిరిట్’ సినిమా స్క్రిప్ట్ డిస్కషన్లో పాల్గొన్న ఆయన, ఈ వారంలోనే ‘ది రాజా సాబ్’లోని తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా కావడంతో హిందీ వెర్షన్‌కి కూడా ప్రభాసే డబ్బింగ్ చెప్పనున్నారట. ప్రస్తుతం ఓ వైపు షూటింగ్‌తో మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌తో ‘ది రాజాసాబ్’ యూనిట్ బిజీగా ఉంది. త్వరలోనే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తారట.
ఇదిలావుంటే ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘స్పిరిట్’ సినిమా విషయంలో ఓ ఆసక్తికరమైన అప్డేట్ వెలుగు చూసింది. పవర్ఫుల్ కాప్ స్టోరీగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఓ క్రేజీ ఫ్లాష్‌బ్యాక్ కూడా ఉంటుందట. సినిమా సెకండాఫ్‌లో వచ్చే ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో ప్రభాస్ పాత్ర మాఫియా నేపథ్యంలో సాగుతుందని తెలుస్తున్నది. ఈ స్క్రిప్ట్ విషయంలో ప్రభాస్ ఫుల్ ఖుషీగా ఉన్నారట. త్వరలోనే ‘స్పిరిట్’ షూటింగ్‌ను మొదలుపెట్టనున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. ఇందులో కథానాయికగా త్రిప్తి డిమ్రీ ఎంపికైక విషయం విదితమే. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల అవుతుంది.