Prabhas | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమా కోసం అయితే ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాని యానిమల్, అర్జున్ రెడ్డి చిత్రాలకి దర్శకత్వం వహించిన సందీప్ రెడ్డి తెరకెక్కించనున్నాడు. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా అప్డేట్ గురించి చాలాకాలంగా ప్రభాస్ అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇదే సమయంలో సినిమా గురించి రోజుకో ఇంట్రెస్టింగ్ వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నెలలో స్టార్ట్ కాబోతోందని, ఇందులో ప్రభాస్ ఎలాంటి డూప్స్ లేకుండా స్టంట్స్ చేస్తాడని సమాచారం.
ప్రస్తుతం ‘స్పిరిట్’ సినిమా కోసం నటీనటుల సెలక్షన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇది పూర్తి కాగానే, సందీప్ రెడ్డి వంగా అక్టోబర్ నెలలో ‘స్పిరిట్’ సినిమాను ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ రూపొందనుందని అంటున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ రాయడానికి ఊహించిన దానికంటే ఎక్కువ సమయం పట్టడంతో షూటింగ్ ఆలస్యం అయింది. ‘స్పిరిట్’ సాధారణ పోలీసు థ్రిల్లర్ కాదు, ఈ మూవీతో వంగా కాప్ డ్రామాలలోనే సరికొత్త ట్రెండ్ సెట్ చేయనున్నాడని సమాచారం.
‘స్పిరిట్’ సినిమా షూటింగ్ షురూ చేసే ముందు ప్రభాస్ తన ప్రస్తుత ప్రాజెక్టులు ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’లను పూర్తి చేయనున్నారట. ఆ తర్వాతే రెబల్ స్టార్ స్పిరిట్ చిత్రంపై ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారట. ఈ మూవీ కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం ప్రభాస్ తన బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కూడా చేసుకోనున్నారని సమాచారం. అయితే ప్రభాస్ గత సినిమాలలో డూప్స్ ఎక్కువగా స్టంట్స్ చేసేవారట. కాని ‘స్పిరిట్’లోని చాలా స్టంట్స్‌ను ప్రభాస్ చేత చేయించాలనేది దర్శకుడి ఆలోచన అని తెలుస్తుంది.. ప్రభాస్‌ని మోస్ట్ వయోలెంట్ రోల్లో చూడాలనుకునే ఫ్యాన్స్‌కి ఈ సినిమమాతో ఆకలి తీరడం ఖాయం అంటున్నారు. ‘స్పిరిట్’ను 2027లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను భూషణ్ కుమార్, సందీప్ రెడ్డి వంగా, ప్రణయ్ రెడ్డి వంగాలతో కలిసి నిర్మిస్తున్నారు