Sandeep Reddy Vanga | విజయ్ దేవరకొండ టైటిల్ రోల్లో అర్జున్ రెడ్డి సినిమా తెరకెక్కించి ఎంట్రీలోనే ఇండస్ట్రీని షేక్ చేశాడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టడమే కాదు.. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. విజయ్ దేవర కొండకు మాస్ ఇమేజ్ సంపాదించి పెట్టింది. ఈ హీరోకు అర్జున్ రెడ్డికి ముందు.. తర్వాతగా మారిపోయింది కెరీర్. చివరగా యానిమల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఈ మూవీ రికార్డు కలెక్షన్లను రాబట్టి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
కాగా ఈ క్రేజీ డైరెక్టర్‌కు సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటివరకు భారీ సినిమాలతో అలరించిన సందీప్ రెడ్డి ఇక నుంచి చిన్న సినిమాలను కూడా ప్రేక్షకులకు అందించబోతున్నాడన్న వార్త మూవీ లవర్స్‌లో జోస్ నింపుతోంది. తాజా టాక్ ప్రకారం సందీప్ రెడ్డి రాబోయే రోజుల్లో లో బడ్జెట్ సినిమాలను తెరకెక్కించడంలో భాగంగా ఇండస్ట్రీకి కొత్త టాలెంట్‌ను పరిచయం చేయాలనుకుంటున్నట్టు ఇన్సైడ్ టాక్.
సందీప్ రెడ్డి ఇప్పటికే హైదరాబాద్‌లో ఓ ఆఫీస్‌ను లీజ్‌కు తీసుకున్నాడని వార్తలు వచ్చాయి. కాగా ఇక్కడి నుంచే రానున్న రెండు సంవత్సరాలపాటు తన వర్క్ పై ఫోకస్ పెట్టబోతున్నాడట. ఇందులో భాగంగా తన టీం కథలను విననుండగా.. సందీప్ రెడ్డి ఫైనల్ చేయనున్నాడట. మొత్తానికి టాలీవుడ్‌కు మరికొందరు దర్శకులను పరిచయం చేయాలని గట్టిగానే ఫిక్సయ్యాడని తాజా అప్డేట్తో అర్థమవుతోంది. ఈ స్టార్ డైరెక్టర్ యానిమల్ సీక్వెల్ చేయబోతున్నాడని తెలిసిందే.