Sandeep Reddy Vanga |’అర్జున్ రెడ్డి’తో సంచలనం సృష్టించాడు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). ఈ సినిమాతో విజయ్ దేవరకొండ (Vijay devera konda)పేరు ఎలా మార్మ్రోగిందో దర్శకుడిగా సందీప్ పేరు కూడా పాపులరైంది. అర్జున్ రెడ్డిని హిందీలో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ (Ranbirkapoor) తో పాన్ ఇండియా మూవీ గా ‘యానిమల్’ (Animal) చేస్తున్నాడు.
తాజాగా యానిమల్ టీజర్ బయటికివచ్చింది. ఈ టీజర్ లో గమనించదగ్గ అంశం ఏమిటంటే.. తొలి సినిమా కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిస్తే ఎంతో కొంత ప్రభావం తర్వాత సినిమాపై పడుతుంది. కానీ సందీప్ మాత్రం రెండో సినిమా యానిమల్ కి పూర్తిగా వైవిధ్యం చూపించాడని టీజర్ చూస్తే అర్ధమౌతుంది. అర్జున్ రెడ్డికి యానిమల్ కథకి పోలికే లేదు. అర్జున్ రెడ్డి ప్రేమకథ ఐతే.. యానిమల్ తండ్రికొడుకుల నేపధ్యంలో సాగే గ్యాంగ్ స్టర్ డ్రామా. అలాగే ఫిల్మ్ మేకింగ్ లో కూడా పూర్తిగా కొత్తదనం కనిపిస్తోంది.
యాక్షన్ మాటల్లో తీవ్రత ఇంకా పెరిగింది. యాక్షన్ ఎపిసోడ్స్ ని లావిష్, ఇంటెన్స్ గా డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. అలాగే పాత్ర మధ్య సంఘర్షణ కూడా వైవిధ్యంగా వుంది. మొత్తానికి ఏ విషయంలోనూ అర్జున్ రెడ్డితో పోలిక రాకుండా పూర్తి భిన్నమైన కథతో వస్తున్నారు సందీప్. యానిమల్ డిసెంబర్ 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
యానిమల్ టీజర్..