Sandeep Reddy Vanga | టాలెంటెడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఈ మధ్య తెగ వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా స్పిరిట్ మూవీ విషయంలో దీపికాతో నెలకొన్న వివాదం వలన సందీప్ రెడ్డి ఛాన్స్ దొరికిన ప్రతిసారి ఆమెని టార్గెట్ చేస్తూనే ఉన్నారు. స్పిరిట్ కోసం దీపికా పదుకొణేని హీరోయిన్గా అనుకున్న సందీప్ రెడ్డి.. ఆ తర్వాత ఆమెను తీసేశారు. దీపిక పెట్టిన కండీషన్స్ నచ్చకే ఆమెకు సందీప్ గుడ్ బై చెప్పేశారని వార్తలొచ్చాయి. అంతేకాదు దీపిక స్థానంలోకి యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీని ఎంపిక చేశారు. అయితే స్పిరిట్ స్టోరీని దీపికా లీక్ చేసిందని ఆమెతో పాటు ఆమె పీఆర్టీమ్పై కూడా సందీప్ రెడ్డి వంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ చిత్రాలతో స్టార్ డైరెక్టర్ల లిస్టులోకి చేరిన సందీప్ రెడ్డి వంగా కేవలం తన డైరెక్షన్ తోనే కాదు తన ఆటిట్యూడ్, లైఫ్ స్టైల్ తోనూ కూడా వార్తలలో నిలుస్తుంటాడు. ఆయన తీసిన కబీర్ సింగ్ చిత్రం విడుదలై ఆరేళ్లు పూర్తి కావడంతో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. కబీర్ సింగ్ చిత్రం షాహిద్ కపూర్, కియారా ప్రధాన పాత్రలలో రూపొంది సూపర్ హిట్ సాధించింది. అయితే తాజాగా సందీప్ రెడ్డి కేవలం కియారా ఫొటోని మాత్రమే షేర్ చేస్తూ.. సినిమాని ఇంత హిట్ చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలిపాడు.
హీరో, హీరోయిన్స్ ఉన్న పోస్టర్ కాకుండా కేవలం కియారా అద్వాని మాత్రమే ఉన్న ఫొటో షేర్ చేయడం ఇప్పుడు చర్చకి దారి తీసింది. కియారాని పొగిడే క్రమంలోనే ఆమె సింగిల్ ఫొటో ఉన్న పోస్టర్ని షేర్ చేశాడని కొందరు ముచ్చటించుకుంటున్నారు. ఏది ఏమైన ఈ మధ్య దీపికా -సందీప్ మధ్య సాగుతున్న కోల్డ్ వార్ బీటౌన్లోను చర్చనీయాంశంగా మారింది.