Sandeep Reddy Vanga – Arjun Reddy | రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో వచ్చిన అర్జున్ రెడ్డి చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అప్పటివరకు టాలీవుడ్లో వస్తున్న సినిమాలకు ఒక ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది ఈ చిత్రం. అయితే ఈ చిత్రం కోసం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా ఎంత కష్టపడ్డారో? ఎలాంటి బాధలు, అనుమానాలు అనుభవించారో అనే విషయాల గురించి తాజాగా వెల్లడించాడు ప్రముఖ రైటర్ కోన వెంకట్.
ఒక టాక్‌షోలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. సందీప్‌రెడ్డి అర్జున్ రెడ్డి కథను పట్టుకుని 5 ఏండ్లు హీరోల వెంట తిరిగినట్లు తెలిపాడు. ఒక హీరో ఆఫీస్‌లో అయితే 3 సంవత్సరాలు స్టోరీని పట్టుకుని ఉన్నాడు. ఎప్పుడు చూసిన ఆ హీరో అయితే వినడమే కానీ కథకి ఓకే చెప్పలేదు. దీంతో బయటకు వచ్చి మళ్లీ వేరే హీరోల వెంట పడ్డాడు. ఇక సందీప్ బాధ చూసిన అతడి అన్నయ్య ప్రణయ్ రెడ్డి వంగా వీడు ఇలానే ఉంటే పిచ్చోడు అయ్యేలా ఉన్నాడు అని నేనే ప్రోడ్యూస్ చేస్తాను అంటూ ముందుకు వచ్చాడు. హీరోగా విజయ్ దేవరకొండ ఓకే చేశాడు. అలా అర్జున్ రెడ్డి సెట్స్ మీదకి వెళ్లింది. బ్లాక్ బస్టర్. కల్ట్ క్లాసిక్ అయ్యిందంటూ కోన వెంకట్ చెప్పుకోచ్చాడు.