‘అర్జున్ రెడ్డి’ ‘యానిమల్’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా. అవకాశమొస్తే ఆయనతో సినిమాలు చేయడానికి అగ్రహీరోలందరూ సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ప్రభాస్‌తో ‘స్పిరిట్’ చిత్రాన్ని రూపొందిస్తున్నారాయన. ఇటీవల విడుదల చేసిన ఆడియోగ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచింది. ‘స్పిరిట్’ ఈ నెలలోనే పట్టాలెక్కనుంది.
మూడునాలుగు నెలల్లో చిత్రీకరణ పూర్తిచేసేలా దర్శకుడు సందీప్‌రెడ్డి ప్లాన్ చేశారట. ఇదిలావుండగా ‘స్పిరిట్’ తర్వాత మహేశ్‌బాబుతో సందీప్‌రెడ్డి వంగా సినిమా ఉంటుందని, అందుకోసం ఆయన ఇప్పటి నుంచే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలుపెట్టారని ఫిల్మ్‌నగర్ టాక్.
ప్రస్తుతం రాజమౌళి సినిమా చేస్తున్నారు మహేశ్‌బాబు. ఇది పూర్తయ్యేసరికి ఏడాదికిపైగా టైమ్ పట్టొచ్చని అంచనా. ఆలోగా ‘స్పిరిట్’ని కూడా పూర్తిచేసి…ఆపై వెంటనే మహేశ్ బాబు ప్రాజెక్ట్‌పై దృష్టిపెట్టాలనే ఆలోచనలో ఉన్నారట సందీప్‌రెడ్డి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మహేశ్-సందీప్‌రెడ్డి సినిమా ఖాయమని సినీ వర్గాల్లో వినిపిస్తున్నది.