Prabhas||డార్లింగ్ ప్రభాస్‌కి ఇప్పుడు ఎంత క్రేజ్, ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. మన దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ ప్రభాస్‌కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఇప్పుడు ప్రభాస్ నాన్‌స్టాప్‌గా సినిమాలు చేస్తున్నారు. ఆయన సినిమాలు వస్తున్నాయంటే అభిమానులు కళ్లల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక హను రాఘవపూడితో కూడా ఓ చిత్రం చేస్తుండగా, ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగాతో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనున్నాడు.
అయితే సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ విషయంలో ప్రభాస్ పప్పులు ఏవి ఉడకడం లేదని అనిపిస్తుంది. సందీప్ రెడ్డి సినిమాని ఎంత ప్రాణంగా ప్రేమిస్తాడో మనకు తెలుసు. ఆయన తీసిన అర్జున్ రెడ్డి, యానిమల్ ఎలాంటి సంచలనాలు సృష్టించాయి. ఇప్పుడు ప్రభాస్‌తో చేయబోతున్న సినిమా ఏ స్టైల్ లో ఉంటుందని ప్రతి ఒక్కరు ఆలోచనలు చేస్తున్నారు. అయితే ప్రభాస్ తో ఎలాంటి సినిమా తీయాలి? అనే విషయంలో గట్టిగా ఫిక్సయి ఉన్నాడు సందీప్ రెడ్డి వంగా . ప్రభాస్ షరతులు పెట్టడం కాదు, ప్రభాస్ కే షరతులు పెడుతున్నాడు సందీప్ రెడ్డి. తన సినిమా మొదలైనప్ప నుంచీ, పూర్తయ్యే వరకూ మరో సినిమా చేయకూడదని కండీషన్ పెట్టాడు. అంతే కాదు తన మూవీ లుక్‌తో బయటక ఎక్కువగా కనిపించకూడదని కూడా చెప్పారట.
కాల్షీట్లు బంచ్‌గా ఇవ్వాలి. వారానికి ఒకరోజో, రెండు రోజులో వచ్చి షూటింగ్ చేస్తే కుదరదు. బాడీ డబుల్స్‌పై ఆధారపడి షాట్లు తీయకూడదు. అసలు డూప్ ప్రస్తావన లేకపోతే బెటర్… అంటూ సందీప్.. ప్రభాస్‌కి పలు కండీషన్స్ పెట్టగా వాటన్నింటికి ప్రభాస్ ఓకే చెప్పాడట. అయితే సందీప్ ఇలా కండీషన్స్ పెట్టడానికి కారణం కూడా ఉంది. ఇప్పుడు రాజా సాబ్, ఫౌజీ రెండు ఒకే సారి షూటింగ్ చేస్తున్నాడు. మధ్యలో ఫారెన్ ట్రిప్స్ వేస్తున్నాడు. అలా చేస్తే సినిమా ఆలస్యం అవుతుందని పక్కా క్లారిటీతో ఉన్న సందీప్.. ప్రభాస్‌కి ఈ కండీయన్స్ పెట్టాడట. దర్శకుడు ఇలా ముందస్తు జాగ్రత్తగా వెళితే నిర్మాతలకి ఎలాంటి సమస్య ఉండదు.