Hombale Films | కొత్త సినిమాను ప్రకటించిన ‘కేజీఎఫ్’ మేకర్స్.. హీరో ఎవరో తెలుసా?
Hombale Films New Movie Announced | 'కేజీఎఫ్' చిత్రంతో హోంబలే ప్రొడక్షన్ సంస్థ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. కేజీఎఫ్ చిత్రానికి ముందు.. కన్నడలో ఓ సినిమా వంద కోట్లు సాధించిందంటే అబ్బో అనుకునే వాళ్ళు.
Hombale Films New Movie Announced | ‘కేజీఎఫ్’ చిత్రంతో హోంబలే ఫిలింస్ ప్రొడక్షన్ సంస్థ పేరు జాతీయ స్థాయిలో మార్మోగిపోయింది. కేజీఎఫ్ చిత్రానికి ముందు.. కన్నడలో ఓ సినిమా వంద కోట్లు సాధించిందంటే అబ్బో అనుకునే వాళ్ళు. అలాంటి సమయంలో హోంబలే సంస్థ ఏకంగా రూ. 200 కోట్ల భారీ బడ్జెట్‌తో కేజీఎఫ్ సిరీస్‌ను తెరకెక్కించి కన్నడ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టింది. అప్పటి నుండి ఈ ప్రొడక్షన్లో తెరకెక్కిన సినిమాలు ఏంటీ అని ప్రేక్షకులు గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సంస్థ తాజాగా తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రకటించింది.
‘ధూమం’ అనే కాన్టెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు హోంబలే సంస్థ తాజాగా ప్రకటించింది. మలయాళ స్టార్ హీరో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించనున్నాడు. నేషనల్ అవార్డు గ్రహిత ఆకాశం నీ హద్దురా ఫేం అపర్ణ బాలమురళీ హీరోయిన్ నటించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రాన్ని సౌత్ లోని అన్ని భాషల్లో రూపొందించనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం అక్టోబర్ 9నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనుంది. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్లో చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్చేస్తున్నారు.
𝐖𝐡𝐚𝐭 𝐲𝐨𝐮 𝐬𝐨𝐰, 𝐬𝐨 𝐬𝐡𝐚𝐥𝐥 𝐲𝐨𝐮 𝐫𝐞𝐚𝐩.
Presenting #Dhoomam.Kickstarting from Oct 9, 2022, End Game begins in Summer 2023.@twitfahadh #Pawan @VKiragandur @aparnabala2@hombalefilms @HombaleGroup @vjsub @Poornac38242912 #PreethaJayaraman @roshanmathew22 pic.twitter.com/5x9zXJsznj
— Hombale Films (@hombalefilms) September 30, 2022
Read Also:
The Ghost Movie | ఆ నాలుగు ఏరియాల కలెక్షన్లను నాగార్జున పారితోషికంగా తీసుకోనున్నాడా?
Mahesh babu | ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఆ పాత్రను ముందుగా మహేష్‌బాబు చేశాడా?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
YS Jagan | ఎన్నికల్లో ఓడినా, ప్రజల మనసులను గెలుచుకున్నాం : వైఎస్ జగన్
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

