The Ghost Movie | ఆ నాలుగు ఏరియాల కలెక్షన్లను నాగార్జున పారితోషికంగా తీసుకోనున్నాడా?
Nagarjuna Remuneration For The Ghost Movie | కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఈ ఏడాది 'బంగార్రాజు'తో సంక్రాంతి రన్నర్‌గా నిలిచిన నాగార్జున.. అదే జోష్‌లో ‘ది ఘోస్ట్’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు.
Nagarjuna Remuneration For The Ghost Movie | కింగ్ నాగార్జున ప్రస్తుతం వరుసగా సినిమాలను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. ఈ ఏడాది ‘బంగార్రాజు’తో సంక్రాంతి రన్నర్‌గా నిలిచిన నాగార్జున.. అదే జోష్‌లో ‘ది ఘోస్ట్’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. ‘గరుడ వేగ’ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది. ఇక ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన టీజర్, ట్రైలర్లు సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్రబృందం వరుస అప్డేట్లను ప్రకటిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాగార్జున రెమ్యూరేషన్కు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
‘ది ఘోస్ట్’ చిత్రంలో నటించినందుకు నాగార్జున రెమ్యునరేషన్‌గా కొన్ని ఏరియా కలెక్షన్లు తీసుకోనున్నాడట. కోలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం వైజాగ్, ఈస్ట్, వెస్ట్, గుంటూరు వంటి నాలుగు ఏరియాల కలెక్షన్లు పారితోషికంగా తీసుకోనున్నాడట. అంతేకాకుండా ది ఘోస్ట్ చిత్రాన్ని అన్నపూర్ణ స్డూడీయోస్పై నాగార్జుననే రిలీజ్ చేస్తున్నాడు. కాగా ఈ చిత్రంలో నాగార్జున ఇంటర్‌పోల్ ఆఫిసర్‌గా కనిపించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. సోనాల్ చౌహన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వరా సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైనమెంట్స్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుస్కురి రామ్మోహన్ రావు, శరత్ మరార్ నిర్మించారు.
Read Also:
Mahesh babu | ‘పొన్నియన్ సెల్వన్-1’లో ఆ పాత్రను ముందుగా మహేష్‌బాబు చేశాడా?
Sakini Daikini Movie | ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ‘శాకిని డాకిని’.. ఏ ప్లాట్‌ఫార్మ్‌లో అంటే?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

